My title

పిచ్చివేషాలు మానుకో… చింతమనేనికి టీడీపీ నేత వార్నింగ్

వివాదాస్పద టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ఫైర్ అయ్యారు. పిచ్చిపిచ్చి వేషాలు వేయవద్దని ప్రెస్‌మీట్ పెట్టి హెచ్చరించారు. పోలీసులు, ప్రజలతో ఇష్టానుసారం మాట్లాడినట్టుగానే పార్టీ కార్యకర్తలు, నాయకులను దూషిస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. ఏలూరు మండల పరిషత్‌ అధ్యక్ష పదవిని కొల్లేరు గ్రామాలకు కట్టబెట్టేందుకు చింతమనేని రూ.40 లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపించారు. అందుకు ప్రతిఫలంగా అనురాధను ఎంపీపీ పీఠం నుంచి తొలగించి కొల్లేరు గ్రామానికి చెందిన ఎంపీటీసీకి ఆ పదవి కట్టబెట్టేందుకు చింతమనేని కుతంత్రాలు చేస్తున్నాడని ఆరోపించారు. లంచాలు పుచ్చుకోవడం, మట్టి, ఇసుక అమ్ముకోవడం, అభివృద్ధి పేరిట ప్రభుత్వ సొమ్ము దోచుకుంటున్నారని మండిపడ్డారు.

You may also like below articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × 4 =