My title

హిందీ సినిమాకు.. తెలుగు, తమిళ్ లో సీక్వెల్??

వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. ఈ వార్త మాత్రం నిజం. బాలీవుడ్ లో ప్రముఖ దర్శక నిర్మాత కేసీ బొకాడియా.. 1985లో రూపొందించిన చిత్రం తేరి మెహర్ బెనియన్. జాకీ ష్రాఫ్, పూనం థిల్లాన్ నటించిన ఈ మూవీ.. అప్పట్లో మంచి టాక్ సొంతం చేసుకుంది. అది విడుదలైన 32 ఏళ్లకు.. ఇప్పుడు.. సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నారు. అది కూడా.. హిందీలో కాదు. తమిళ్, తెలుగు భాషల్లో.. ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ తీసుకున్న తమిళ హీరో శ్రీకాంత్.. అవకాశాలు లేక ఫేడ్ అవుతున్న నికీషా పటేల్.. ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, చెన్నైల్లో 20 శాతం షూటింగ్ పూర్తయిందని.. హీరో శ్రీకాంత్ చెప్పాడు. మర్డర్ థ్రిల్లర్ గా.. ఆకట్టుకునే కథాంశంతో సినిమా ఉంటుందన్నాడు.

నికీషా పటేల్ స్పందిస్తూ.. సినిమాలో అవకాశంపై ఆనందంగా ఉందని చెప్పింది. తేరి మెహర్ బెనియన్ సినిమాకు సీక్వెల్ అయినా.. దానికీ దీనికీ సంబంధం ఉండదని అంటోంది. అంతే కాక.. బొకాడియా సినిమాల్లో ఉన్నట్టే.. ఇందులో కూడా హీరో హీరోయిన్ల మధ్య.. మాంఛి రొమాన్స్ ఉంటుందని.. కచ్చితంగా అందరినీ అలరిస్తుందన్న నమ్మకం ఉందనీ ఊరిస్తోంది… నికీషా.