My title

తాప్సీకి ఏమైంది? ఇలా రెచ్చిపోతోంది

పంజాబీ భామ తాప్పీ అందాల అర‌బోత మొద‌లెట్టింది. బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తొలినాళ్ల‌లో కొంచెం డీగ్లామ‌ర్ పాత్ర‌లు చేసిన భామ‌…ఇప్పుడు మాత్రం గ్లామ‌ర్ డోస్ పెంచింది. ఒక లెవ‌ల్లో అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇటీవ‌లే విడుద‌లైన‌ జుద్వా 2 సినిమా కోసం తాప్సీ గ్లామ‌ర్ ఒల‌క‌ బోసింది. ఒక లెవ‌ల్లో రెచ్చిపోయింది.  బికినీ వేసి కుర్ర‌కారును రెచ్చ‌గొట్టింది. అంతేకాదు హాట్ హాట్ కిస్‌ల‌తో మతిపొగొట్టింది. దీంతో ఆమెను నెటిజ‌న్లు ఒక ఆట ఆడుకున్నారు. అయితే ఆమె అప్పుడు వాటికి గ‌ట్టిగానే స‌మాధానం ఇచ్చింది.

అయితే ఇప్పుడు మ‌ళ్లీ టూపీస్ బికీనీలో తాప్సీ మెరిసింది. మాగ్జిమ్ మ్యాగ‌జీన్ కోసం బికినీలో ఫోజు ఇచ్చి అద‌ర‌గొట్టింది. బ్లూ క‌ల‌ర్ బికినివేసుకుని త‌న బ‌క్క ప‌ల‌చైన అందాల‌ను ప్ర‌ద‌ర్శించింది. డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు పాట‌ల చిత్రీక‌ర‌ణ‌పై సైటైర్లు వేసిన తాప్సీ…బాలీవుడ్‌కు వెళ్ల‌గానే ఈ అందాల ప్ర‌ద‌ర్శ‌న మొద‌లుపెట్డడం హాట్‌టాపిక్‌గా మారింది. అవ‌కాశాలు రావాలంటే మ‌డిక‌ట్టుకుని కూర్చుంటే లాభం లేద‌ని లేట్‌గా తెలుసుకున్న ఈ పంజాబీ భామ‌…ఇప్పుడు స్కిన్ షో మొద‌లుపెట్టింద‌ని బాలీవుడ్ కోడై కూస్తోంది.