My title

“సై రా నరసింహ రెడ్డి” నుంచి తప్పుకున్న ఏ ఆర్ రెహమాన్

మెగా స్టార్ చిరంజీవి 151 మూవీ గా తెరకెక్కుతున్న మూవీ “సై రా నరసింహ రెడ్డి”. చిరంజీవి తనయుడు   మెగా పవర్ స్టార్ రామచరణ్ ఈ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి హై బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. అసలు ఈ కాస్టింగ్ చూడాగానే ఆడియన్స్ అందరికీ ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇదిలా ఉంటె మూవీ యూనిట్ ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారు. అందుకు తగ్గట్టు గానే మూవీ యూనిట్ కూడా ఈ సినిమాకి మ్యూజిక్ అందించేది ఏ ఆర్ రహమాన్ అని  పబ్లిక్ గా అనౌన్స్ చేసింది. కానీ ఇప్పుడు ఈ మూవీ నుంచి ఏ ఆర్ రహమాన్ తప్పుకున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. కేవలం తనకి ఉన్న ప్రీవియస్ కమిట్మెంట్స్ వల్లే ఏ ఆర్ రహమాన్ ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఏ ఆర్ రహమాన్ ప్లేస్ లో మూవీ యూనిట్ ఎస్ ఎస్ తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలి అని అనుకుంటున్నారట. ఆల్రెడీ ఎస్ ఎస్ తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే “సై రా” యొక్క మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసారు మూవీ యూనిట్.