My title

మీరుండేది ఐదేళ్లు…. మీ అబ్బ సొత్తులా చేస్తున్నారు….

ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టీటీడీ, దేవాదాయ ధర్మాదాయ శాఖలను వ్యాపార కేంద్రాలుగా మార్చేశారని మండిపడ్డారు. రాజకీయ నిరుద్యోగులను ఆలయాల చైర్మెన్ లుగా నియమిస్తున్నారని ఆక్షేపించారు. బ్రాహ్మణులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరాచకాలు పెరిగిపోతున్నా ప్రభుత్వాలకు మాత్రం కనువిప్పు కలగడం లేదన్నారు. దేవాదాయ శాఖ ఆస్తులను 90ఏళ్లు లీజుకు ఇవ్వడం సరికాదన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండే వారికి…. దేవుడి భూములను ఏకంగా 90 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు. దేవుడి భూములు ఏమైనా మీ అబ్బ సొత్తా అని ప్రశ్నించారు. తాను ఏదైనా మంచి సూచన చేస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తమ మంచితనాన్ని చేతగాని తనంగా భావించవద్దనన్నారు. తాను సమయం కోసం ఎదురుచూస్తున్నానని స్వరూపానందేంద్ర హెచ్చరించారు. శారదాపీఠంలో ఎంపీ సుబ్బరామిరెడ్డి సౌజన్యంతో అతిరుద్ర, మహా చండీయాగాన్ని స్వరూపనందేంద్ర గురువారం ప్రారంభించారు.