My title

డైరీలో బాబు పేరు… సుప్రీంలో వెల్లడించిన ప్రశాంత్ భూషణ్

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సంబంధించి మరో అంశం వెలుగులోకి వచ్చింది. దేశంలో సంచలనం సృష్టిస్తున్న సహారా డైరీలో చంద్రబాబు పేరు కూడా బయటకు వచ్చింది. న్యాయవాదులతో కిక్కిరిసిపోయి ఉన్న సుప్రీం కోర్టులోనే చంద్రబాబు పేరును చదివి వినిపించారు. సుప్రీం కోర్టు న్యాయవాది, ప్రముఖ సామాజిక వేత్త ప్రశాంత్‌ భూషణ్‌ సహారా డైరీలోని పేర్లను బహిరంగంగా సుప్రీం కోర్టులో చదివి వినిపించారు. డైరీలో ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు పేరు కూడా ఉంది. 2014లో సహారా కంపెనీలపై జరిగిన ఐటీ దాడుల్లో ఈ డైరీలు బయటపడ్డాయి. ఏఏ నేతకు ఎంత ముడుపులు ఇచ్చింది అందులో సహార కంపెనీ సదరు డైరీలో పొందుపరిచింది. ఈ కేసును సుప్రీం కోర్టు విచారిస్తున్న సమయంలో ప్రశాంత్‌ భూషణ్ డైరీలోని పేర్లను చదివి వినిపించారు. అందులో మోదీ, అద్వానీ, చంద్రబాబు, సుష్మాస్వరాజ్, ములాయం సింగ్ యాదవ్ తదితరులు ఉన్నారు.  అయితే సహారా గ్రూపుల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు సహా పలువురు నాయకులు ముడుపులు స్వీకరించారంటూ దాఖలైన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.  అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి వ్యతిరేకంగా ఉన్న పత్రాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని డైరీ ఆధారంగా  చర్యలు తీసుకోలేమని తేల్చిచెప్పింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

11 + fourteen =