My title

రాజ్యాంగ ధ‌ర్మాస‌నానికి శ‌బ‌రిమ‌ల కేసు

శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో మ‌హిళ‌ల ప్ర‌వేశంపై నెల‌కొన్న వివాదం సుప్రీం ధ‌ర్మాస‌నానికి చేరింది. మ‌హిళ‌ల‌కు ఆల‌య ప్ర‌వేశ నిరాక‌ర‌ణ‌ రాజ్యాంగంలో ఆర్టిక‌ల్ 14 ని ఉల్లంఘించడం కింద వ‌స్తుందా అనే అంశాన్ని ధ‌ర్మాసనం తేల్చ‌నుంది.

సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ దీప‌క్ మిశ్రాతో పాటు జ‌స్టిస్ భానుమ‌తి, జ‌స్టిస్ అశోక్ భూష‌న్ లు  ఈ అంశానికి సంబంధించి ఆరు ప్ర‌శ్న‌ల‌ను ధ‌ర్మాస‌నం ముందుంచారు.

10 నుంచి 50 ఏళ్ల లోపు మ‌హిళ‌ల‌ను ఆల‌యంలోకి అనుమ‌తి నిరాక‌రించే ఆన‌వాయితీ స‌మంజ‌స‌మేనా అనే అంశం ధ‌ర్మాసనం తేల్చ‌నుంది.

హిందూ ప్లేసెస్ అండ్ ప‌బ్లిక్ వ‌ర్షిప్ చ‌ట్టం ప్ర‌కారం మ‌హిళ‌లు ఆల‌యాల్లో ప్ర‌వేశించ‌డానికి ఎటువంటి ఆటంకాలు లేవ‌ని చెబుతోంది. శ‌బ‌రిమ‌ల‌లో ఉన్న ఆన‌వాయితీ ఈ చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తుందా అనే అంశాన్ని కూడా ధ‌ర్మాసనం దృష్టి పెట్ట‌నుంది.

ప‌ట‌నంతిట్ట జిల్లాలో ఉన్న శ‌బ‌రిమ‌ల ఆల‌యం 12వ శ‌తాబ్ధానికి చెందిన‌ది.

2007 లో అనుమ‌తి

2007లో క‌మ్యూనిస్టుల ఆధ్వ‌ర్యంలో ఎల్‌డిఎఫ్ ప్ర‌భుత్వం మ‌హిళల ప్ర‌వేశంపై ఉన్న ఆంక్ష‌ల‌ను ఎత్తివేసింది. ఆ త‌ర్వాత కొంత‌కాలానికి అధికారంలోకి వ‌చ్చిన యూడిఎఫ్ ప్ర‌భుత్వం తిరిగి ఆంక్ష‌లు విధించింది.

ప్ర‌స్తుతం క‌మ్యూనిస్టు ప్ర‌భుత్వం అధికారంలో ఉంది. గ‌త ఏడాది సుప్రీంకోర్టుకు ఈ విష‌య‌మై త‌మ అభిప్రాయాన్ని తెలియ‌జేసింది. శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి మ‌హిళ‌ల ప్ర‌వేశానికి త‌మ‌కెలాంటి అభ్యంత‌రం లేద‌ని తెలిపింది.

శ‌బ‌రిమ‌ల ఆల‌య యాజ‌మాన్యం కూడా త‌మ అభిప్రాయాల‌ను ఉన్న‌త న్యాయ‌స్థానం ముందుంచింది. 10 నుంచి 50 సంవ‌త్స‌రాల వ‌య‌సుగ‌ల మ‌హిళ‌లు రుతుస్రావం సంద‌ర్భంలో ప‌విత్రంగా ఉండ‌లేర‌ని ఆల‌యం నిర్వాహకులు కోర్టుకు వివ‌రించారు.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 20 వ తేదీన సుప్రీంకోర్టు త‌న తీర్పును రిజ‌ర్వ్‌లో పెట్టింది. నేడు ఆ అంశాన్ని సుప్రీం ధ‌ర్మాస‌నానికి అప్ప‌గించింది.