My title

తమిళ రీమేక్ లో నటించనున్న సునీల్….

తెలుగు తెరపై ఈ మధ్య కాలం లో చాలా రీమేక్ సినిమాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద హీరోలు కూడా రీమేక్ మూవీ లు చేయడానికి వెనకాడట్లేదు. ఇప్పుడు సునీల్ కూడా ఈ రీమేక్ బాట పట్టాడు. గతంలో తమిళంలో విడుదలై మంచి విజయం సాధించిన “శతురంగ వెట్టై” అనే మూవీ ని తెలుగు లో సునీల్ రీమేక్ చేయనున్నాడు. ఓ పెద్ద తమిళ సినిమా ఫైనాన్షియర్ ఈ మూవీతో  తెలుగు ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెడుతున్నారట. ఆయనతో కలిసి తెలుగులో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక శివప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఏడాది క్రితం నాని-ఇంద్రగంటిల కాంబినేషన్లో జెంటిల్ మాన్ సినిమాని ఆడియన్స్ కి అందించారు శివలెంక శివప్రసాద్. అక్టోబర్ లో ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకేల్లడానికి ట్రై చేస్తున్నారు నిర్మాతలు.

ప్రస్తుతం సునీల్ రెండు సినిమాతో బిజీ గా ఉన్నాడు. అందులో ఒకటి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున “ఉంగరాల రాంబాబు”. ఈ మూవీ సెప్టెంబర్ 15 న విడుదల అవుతుంది. సునీల్ చేస్తున్న మరో సినిమా “టూ కంట్రీస్” విడుదలకు రెడీగా వుంది. అక్టోబర్ లేదా నవంబర్ లో ఆ మూవీ కూడా విడుదలవుతుంది. మరి కమెడియన్ నుంచి హీరో గా మారి ఎక్కువ సక్సెస్ లు అందుకొని సునీల్ కి ఈ సినిమాలు అయినా సక్సెస్ ని తీసుకోస్తాయో లేదో చూడాలి.