My title

ఎట్టకేలకు రూటు మార్చిన సునీల్

సునీల్ సినిమా థియేటర్లలోకి వచ్చిన ప్రతిసారి వినిపించే కామన్ డిమాండ్ ఒక్కటే. సునీల్ గతంలోలా కామెడీ పాత్రలు కూడా చేయాలంటూ కామెంట్స్ వచ్చాయి. నిజానికి హీరోగా చాలా సినిమాలు చేసినప్పటికీ.. ఇప్పటికీ సునీల్ అంటే గుర్తొచ్చేవి ఒకప్పటి కామెడీ సన్నివేశాలే. అందుకే క్రిటిక్స్ తో పాటు ప్రేక్షకులు కూడా సునీల్ మళ్లీ తన కామెడీ ట్రాక్ లోకి రావాలని కోరుకున్నారు. ఎట్టకేలకు దీనిపై ఓ నిర్ణయం తీసుకున్నాడు సునీల్.

ఇకపై హీరోగానే కాకుండా కమెడియన్ గా కూడా నటిస్తానని ప్రకటించాడు సునీల్. సినిమాల్లో హీరోగా నటిస్తూనే, స్టార్ హీరోల సినిమాల్లో కామెడీ క్యారెక్టర్లు చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపాడు. ప్రేక్షకులకు, తనకు మధ్య గ్యాప్ పెరగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు.

సునీల్ నిర్ణయమైతే తీసుకున్నాడు కానీ అతడికి కమెడియన్ గా అవకాశాలు వస్తాయా అనేది ప్రస్తుతానికి డౌట్. ఎందుకంటే సునీల్ స్థానాన్ని భర్తీ చేస్తూ వెన్నెల కిషోర్, షకలక శంకర్, ప్రియదర్శితో పాటు చాలామంది కమెడియన్లు వచ్చేశారు. ఇదొక ఎత్తయితే, మళ్లీ సునీల్ కు కమెడియన్ గా అవకాశం ఇస్తే తోటి నటీనటులతో ఇగో సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇవన్నీ సునీల్ ఓసారి గుర్తుపెట్టుకుంటే మంచిది.