My title

షూటింగ్ పూర్తిచేసుకున్న సందీప్ కిషన్ “కేరాఫ్ సూర్య”

కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి మంచి హిట్స్ ని తన ఖాతా లో వేసుకున్నాడు యువ హీరో సందీప్ కిషన్. అయితే సందీప్ కిషన్ లాస్ట్ మూవీ అయిన “నక్షత్రం” పై సందీప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆ మూవీ ఫ్లాప్ తో డీలా పడిపోయాడు సందీప్ కిషన్. ఈ పరాజయాన్ని పక్కన పెట్టి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో త్వరలోనే “కేరాఫ్ సూర్య” అంటూ ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు సందీప్ కిషన్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై కాస్తంత పాజిటివ్ బజ్ నెలకొంది. “నా పేరు శివ” మూవీ ఫేమ్ సుశీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఒకే సారి అటు తమిళ్ లో ఇటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే   ఈ మూవీ యొక్క షూటింగ్ ఈరోజు పూర్తయింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులకి వెళ్లనున్న ఈ మూవీ ని వచ్చే నెల నవంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. డి. ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన మెహ్రీన్  హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులొ “స్వామి రా రా” వంటి థ్రిల్లర్ ని ప్రొడ్యూస్ చేసిన చక్రి చిగురిపాటి ఈ మూవీ ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.