My title

ఉయ్యాలవాడపై సుకుమార్ రియాక్షన్

చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ సినిమా గురించి సుకుమార్ కు తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఓ క్రియేటర్ గా సుక్కూ సలహాలు తీసుకున్నారు. ఇప్పుడీ సినిమా గురించి సుకుమార్ ప్రత్యేకంగా మాట్లాడాడు. దీనికి ఓ కారణం కూడా ఉంది. ఉయ్యాలవాడ సినిమాకు నిర్మాత రామ్ చరణ్. ఆ హీరోతో ప్రస్తుతం రంగస్థలం అనే సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు సుకుమార్. ఇక ఉయ్యాలవాడను డైరక్ట్ చేయబోయే సురేందర్ రెడ్డి తనకు బెస్ట్ ఫ్రెండ్. అందుకే ఈ ప్రాజెక్టుపై సుక్కూ మాట్లాడాడు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ నాకు తెలుసు. సినిమా టెర్రిఫిక్ గా ఉంటుంది. కథ వింటే ఎవరైనా థ్రిల్ ఫీల్ అవుతారు. సురేందర్ రెడ్డి అంత చక్కగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఇక పరుచూరి బ్రదర్స్ మాటల గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆల్రెడీ హిట్ అయిన ప్రాజెక్టును సురేందర్ రెడ్డి డైరక్ట్ చేయబోతున్నాడు. సుకుమార్ ఇలా చిరంజీవి సినిమాను ఆకాశానికెత్తేశాడు.

చిరంజీవి దర్శకుల లిస్ట్ లో సుకుమార్ కూడా ఉన్నాడు. ఇప్పటికే మెగాస్టార్ కు సుకుమార్ ఓ స్టోరీ కూడా వినిపించాడనే టాక్ ఉంది. దీనికి మరో సెంటిమెంట్ కూడా బలమిస్తోంది. అదేంటంటే.. రామ్ చరణ్ తో సినిమా చేసిన తర్వాతే సురేందర్ రెడ్డికి చిరంజీవి మూవీ ఆఫర్ దక్కింది. సో.. ఇప్పుడు రామ్ చరణ్ తో సుకుమార్ మూవీ చేస్తున్నాడు కాబట్టి నెక్ట్స్ చిరంజీవి సినిమా ఛాన్స్ దక్కినా దక్కొచ్చు.