My title

ప్రొడ్యూసర్ అవతారం ఎత్తిన సుధీర్ బాబు

మహేష్ బాబు బావ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు, అతి తక్కువ కాలం లోనే ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. సుధీర్ బాబు కెరీర్ లో మంచి సినిమాలు ఉన్నా గాని హిట్స్ మాత్రం లేవు. సుధీర్ బాబు కెరీర్ లో ఉన్న ఏకైక బిగ్గెస్ట్ హిట్ “ప్రేమ కధా చిత్రం” అని చెప్పొచు. అయితే ఇప్పుడు తన కెరీర్ గ్రాఫ్ ని పెంచుకోడానికి సుధీర్ బాబే స్వయంగా ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు. అవును తన తదుపరి సినిమా ని తానే స్వయంగా ప్రొడ్యూస్ చేసుకుంటున్నాడు సుధీర్ బాబు. రీసెంట్ గానే ఈ మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ అయ్యింది అంట. రాజ శేఖర్ నాయుడు ఈ మూవీ తో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. అసలైతే నిజానికి ఈ చిత్రాన్ని వేరే నిర్మాతతోనే స్టార్ట్ చేసారట. కానీ చివరి నిమిషంలో ఆ నిర్మాత తప్పుకోవడంతో ఈ మూవీని తనే నిర్మించాలని ఫిక్స్ అయిపోయాడట సుధీర్ బాబు. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ మూవీ లో కన్నడ భామ నాభా నతేష్ హీరోయిన్ గా నటించనుంది. మరి ఈ మూవీ అయినా సుధీర్ బాబు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న హిట్ ని అందిస్తుందో లేదో చూడాలి.