My title

కోర్టుకు రవిశంకర్ తలతిక్క సమాధానం

గత ఏడాది ఢిల్లీ యమునా నది ఒడ్డున‌ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ మూడురోజుల పాటు కల్చ‌రల్ ఫెస్టివల్ నిర్వహించారు. దీనికోసం నదీ పరివాహక ప్రాంతంలో వేయి ఎకరాల విస్తీర్నాన్ని చదునుచేసి ఏడు ఎకరాల్లో స్టేజి నిర్మించి అంగరంగ వైభవంగా మూడు రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించారు.ఈ ఫెస్టీవల్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. పర్యావరణ వేత్తలు ఈ వరల్డ్ కల్చ‌రల్ ఫెస్టీవల్ వలన వాతావరణానికి తీవ్రవిఘాతం ఏర్పడుతుందని.. ఈ కార్యక్రమానికి అనుమతించవద్దు అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ని కోరారు. అప్పటికే చాలా ఆలస్యం అయినందువల్ల కార్యక్రమాన్ని ఆపలేమని అయితే పర్యావరణానికి చాలా నష్టం జరిగే విషయం నిజమేనని, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్ట్ ఆఫ్ లీవింగ్ ఫౌండేషన్ పై అయిదు కోట్ల ఫైన్ వేసారు. నిజానికి అక్కడ పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి పదేళ్ళ సమయం, నలభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని పర్యావరణ వేత్తలు చెప్పారు. ఆశ్చర్యమేమిటంటే కోర్టు ఎన్నిసార్లు మందలించినా గురువు రవిశంకర్ ఆ అయిదు కోట్లు కట్టలేదు. నిన్న రవిశంకర్ మా కల్చ‌రల్ ఫెస్టీవల్ వలన పర్యావరణానికి ఏమన్న నష్టం కలిగి ఉంటే దానికి అనుమతించిన ప్రభుత్వము, కోర్టులదే బాధ్యత అని కామెంట్ చేసాడు. దానికి మండిపడ్డ గ్రీన్ ట్రిబ్యూనల్ కోర్ట్ మీరు ఏమాత్రం బాధ్యతలేని వ్యక్తిలాగా మీరు ఉన్నారు. మీరు ఏమి అనుకుంటే అది మాట్లాడే స్వేచ్ఛ ఉందనుకుంటున్నారా ? అంటూ తీవ్రంగా మందలించింది.