My title

“సాహో” లో తన క్యారెక్టర్ గురించి రివీల్ చేసిన శ్రద్ధ కపూర్

“బాహుబలి” తరువాత ప్రభాస్ నటిస్తున్న మూవీ “సాహో”. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ అయిన యువి క్రియేషన్స్ ఈ మూవీ ని ప్రొడ్యూస్ చేస్తుంది. “రన్ రాజా రన్” ఫేం సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు మూవీ యూనిట్. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయిన ఈ మూవీ గురించి గత కొన్ని రోజులుగా కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. అవేంటి అంటే ఈ మూవీ లో శ్రద్ధ డ్యూయల్ రోల్ నటిస్తుంది అనే న్యూస్ లేటెస్ట్ గా సిని సర్కిల్ లో ప్రచారం అయింది. అయితే ఈ విషయం పై హీరోయిన్ శ్రద్ధ కపూర్ క్లారిటీ ఇస్తూ…. సాహో సినిమాలో నాది చాలా ఇంట్రెస్టింగ్ రోల్. కానీ మీడియాలో వచ్చినట్లు నేను ఇందులో డ్యూయల్ రోల్ లో నటించడం లేదు, ఓన్లీ ఒక్క పాత్ర లో మాత్రమె నటిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ఇక ఈ మూవీ లో నేను ఒక పాత్ర లో నటించినప్పటికీ ఈ మూవీ లో నా రోల్ కి చాలా షేడ్స్ ఉంటాయి అని చెప్పుకొచ్చింది ఈ బాలీవుడ్ భామ. అలాగే తన పై ఈ మూవీ లో కొన్ని ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి అని ఈ సంధర్బంగా చెప్పుకొచ్చింది శ్రద్ధ కపూర్. అయితే ప్రస్తుతం “సాహో” కోసం శ్రద్ధ కొన్ని ఫైట్స్ నేర్చుకుంటుందట.