My title

స్పైడర్ టీజర్.. యాక్షన్ ఎక్కువ, కొత్తదనం తక్కువ

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ స్పైడర్ హంగామా మొదలైంది. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఇంతకుముందు విడుదలచేసిన గ్లింప్స్ ఆఫ్ స్పైడర్ చూసి, టీజర్ లో ఏదో కొత్తదనం ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. స్పైడర్ పక్కా యాక్షన్ మూవీ, దానికి మురుగదాస్ టచ్ మాత్రం తోడైందంతే.
చూస్తుంటే ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపిస్తోంది. దీనికి తోడు ఓ ప్రధాన సమస్యను కూడా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఎస్ జే సూర్య విలన్ గా ఎంట్రీ ఇవ్వడం, డైలాగ్స్ చెప్పడం బాగుంది. ఇక చివర్లో “మాకూ భయపెట్టడం తెలుసంటూ” మహేష్ పంచ్ డైలాగ్ విసరడం టీజర్ కు ఓ బ్రాండ్ న్యూ ఫీల్ తీసుకొచ్చింది. ఇక మహేష్ ను ప్రేమించే పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా టీజర్ లో చూపించి ఎట్రాక్ట్ చేశారు. ఇలా అన్నీ మిక్స్ చేసి టీజర్ కట్ చేశారు.
ఓవరాల్ గా చెప్పాలంటే టీజర్ కు కాస్త ఎక్కువగా, ట్రయిలర్ కు కాస్త తక్కువగా స్పైడర్ టీజర్ ఉంది. సినిమా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ అనే విషయాన్ని టీజర్ తో స్పష్టంగా చెప్పేశారు. దసరా కానుకగా వచ్చేనెల 27న స్పైడర్ సినిమా థియేటర్లలోకి రానుంది.