My title

స్పైడర్ దూసుకెళ్తున్నాడు

మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ సినిమా టీజర్ సోషల్ మీడియాలో బాగా నడుస్తోంది. ఓవైపు టీజర్ లో కొత్తదనం లేదని, కూసింత రొటీన్ గానే ఉందంటూ విమర్శలు వస్తున్నప్పటికీ.. చూసేవాళ్ల సంఖ్య మాత్రం బాగానే ఉంది. తాజాగా స్పైడర్ టీజర్ 8 మిలియన్ మార్క్ చేరుకుంది. యూట్యూబ్, ఫేస్ బుక్ లో కలిపి ఈ సినిమా ట్రయిలర్ చూసిన వాళ్ల సంఖ్య 80లక్షలకు చేరుకుంది. రిలీజై 2 రోజులైనా కాకముందే ఇంత నంబర్ రావడం నిజంగా గ్రేట్.
ఇదే ఊపులో త్వరలోనే స్పైడర్ కు సంబంధించి మరింత మెటీరియల్ రిలీజ్ చేస్తేందుకు రెడీ అవుతున్నారు. కుదిరితే వచ్చే వారమే స్పైడర్ సినిమా నుంచి సెకెండ్ సాంగ్ విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఇక థియేట్రికల్ ట్రయిలర్ ను వచ్చే నెల మొదటి వారంలో లాంచ్ చేయబోతున్నారు.
మహేష్-రకుల్ హీరోహీరోయిన్లుగా, మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఒక పాట పెండింగ్ ఉంది. ఈనెల 23 నుంచి ఈ పాట షూటింగ్ ఉంటుంది. ఈ ఒక్క పాట కోసం యూనిట్ అంతా రొమేనియా వెళ్లబోతోంది.