My title

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న స్పైడర్

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న స్పైడర్ సినిమా టీజర్ సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతోంది. తాజాగా ఈ టీజర్ 15 మిలియన్ వ్యూస్ సాధించింది. యూట్యూబ్, ఫేస్ బుక్ లో కలిపి షార్ట్ టైమ్ లో ఓ సినిమా టీజర్ కోటిన్నర వ్యూస్ సాధించడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు కొన్ని తెలుగు సినిమాలు మంచి వ్యూస్ సాధించినప్పటికీ.. షార్ట్ టైమ్ లో కోటిన్నర వ్యూస్ సాధించిన సినిమాగా స్పైడర్ రికార్డు సృష్టించింది.

మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ పెండింగ్ ఉంది. ఈనెల 23 నుంచి ఈ పాట షూటింగ్ ఉంటుంది. ఈ ఒక్క పాట కోసం యూనిట్ అంతా రొమేనియా వెళ్తుంది. ఈ షూటింగ్ తో టోటల్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది.

మరోవైపు ఈ సినిమా ఆడియోను సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కేవలం ఈ సినిమా ప్రమోషన్ కోసమే 2 వారాలు టైం కేటాయించాలని నిర్ణయించాడు మహేష్. ఈ మూవీతో తమిళ్ లో కూడా నేరుగా ఎఁట్రీ ఇస్తున్నాడు ప్రిన్స్. అందుకే అక్కడ్ కూడా ఎగ్రెసివ్ గా సినిమాను ప్రమోట్ చేయాలని నిర్ణయించాడు. సెప్టెంబర్ 27న స్పైడర్ రిలీజ్ అవుతుంది.