My title

స్పైడర్: తెలుగు రాష్ట్రాల్లో 50శాతం నష్టం

మహేష్, మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన స్పైడర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ చేసింది. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా దాదాపు 70 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. విడుదలైన మొదటి వారం అటుఇటుగా 31 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. కానీ రెండు వారాల్లో ఈ మొత్తం షేర్ విలువ 33 కోట్ల 32 లక్షలు మాత్రమే. మరో వారం ఈ సినిమాను కష్టపడి థియేటర్లలో ఆడించినా షేర్ విలువ 35 కోట్ల రూపాయలు దాటుతుందనే గ్యారెంటీ లేదు. సో.. ఓవరాల్ గా స్పైడర్ సినిమా 70 కోట్ల రూపాయలకు అమ్ముడుపోతే, 35 కోట్ల రూపాయలు మాత్రమే బిజినెస్ చేసినట్టు లెక్క. అంటే డిస్ట్రిబ్యూటర్లకు అటుఇటుగా 35 కోట్ల రూపాయలు లాస్ అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో స్పైడర్ 2 వారాల వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 9.90 కోట్లు

సీడెడ్ – రూ. 4.80 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 3.95 కోట్లు

ఈస్ట్ – రూ. 3.82 కోట్లు

వెస్ట్ – రూ. 2.90 కోట్లు

గుంటూరు – రూ. 3.65 కోట్లు

కృష్ణా – రూ. 2.45 కోట్లు

నెల్లూరు – రూ. 1.85 కోట్లు

 

టోటల్ షేర్ – రూ. 33.32 కోట్లు