My title

ఓవర్సీస్ పై కన్నేసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఓవర్సీస్ పై కన్నేశాడు. బాహుబలి-2 ఓవర్సీస్ రికార్డుల్ని కొల్లగొట్టడం మాట అటుంచి, కనీసం రిలీజ్ లో ఆ సినిమా స్థాయిలో స్పైడర్ ను ఉంచాలనుకుంటున్నాడు మహేష్ . అందుకే యూఎస్ లో స్పైడర్ సినిమాను ఏకంగా 600కు పైగా తెరలపై ప్రదర్శనకు పెట్టారు.

ఒక్క అమెరికాలోనే 400లకు పైగా లొకేషన్లలో స్పైడర్ సినిమా హంగామా చేయబోతోంది. ఈ 400 లొకేషన్లలో ఉన్న 6వందలకు పైగా స్క్రీన్స్ ను స్పైడర్ కోసం బుక్ చేశారు. అంటే సగటున 10 నుంచి 20 మైళ్లు ప్రయాణిస్తే అమెరికా అంతటా స్పైడర్ మూవీని ఎక్కడైనా చూసేలా ఏర్పాట్లు చేశారు.

ఇక వెర్షన్ వారీగా చూస్తే.. స్పైడర్ సినిమా అమెరికాలో తెలుగు వెర్షన్ కు 260 లొకేషన్లు కేటాయించగా, తమిళ వెర్షన్ కు కూడా భారీగా 150 లొకేషన్లు ఇచ్చారు. ఎఁదుకంటే ఈ సినిమాకు మురుగదాస్ దర్శకుడు అనే విషయం తెలిసిందే. ఇక మిగతా ప్రాంతాల్లో మలయాళం, అరబ్బీ భాషల్లో స్పైడర్ సినిమా రిలీజ్ అవుతుందన్నమాట. ఈనెల 26 నుంచే, అంటే విడుదలకు ఒక రోజు ముందు నుంచే ప్రీమియర్స్ రూపంలో అమెరికాలో స్పైడర్ హంగామా షురూ కానుంది.