My title

దసరా, దీపావళి పండగలకు ప్రత్యేక రైళ్లు

నెంబర్‌ 08573 విశాఖపట్టణం – తిరుపతి ప్రత్యేక రైలు అక్టోబర్‌ 2, 9, 16, 23, 30, నవంబర్‌ 6, 13, 20, 27 తేదీల్లో రాత్రి 10.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 6.10 గంటలకు న్యూగుంటూరు వచ్చి మధ్యాహ్నం 1.25కు తిరుపతి చేరుకొంటుంది.

నెంబర్‌ 08574 తిరుపతి – విశాఖపట్టణం ప్రత్యేక రైలు అక్టోబర్‌ 3, 10, 17, 24, 31, నవంబర్‌ 7, 14, 21, 28 తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి రాత్రి 10.20 గంటలకు న్యూగుంటూరు వచ్చి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు విశాఖపట్టణం చేరుకొంటుంది.

నెంబర్‌ 07425 కాచీగూడ – కాకినాడ పోర్టు ప్రత్యేక రైలు ఈ నెల 29, అక్టోబర్‌ 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు గుంటూరు వచ్చి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కాకినాడపోర్టుకు చేరుకొంటుంది.

నెంబర్‌ 07426 కాచీగూడ – కాకినాడ పోర్టు ప్రత్యేక రైలు ఈ నెల 30, అక్టోబర్‌ 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు గుంటూరుకు వచ్చి మరుసటి రజు వేకువజామున 5.10 గంటలకు కాచీగూడ చేరుకొంటుంది.

ఈ రైళ్లలో ఏసీ టూటైర్‌, త్రీటైర్‌, స్లీపర్‌క్లాస్‌, జనరల్‌ సెకెండ్‌ క్లాస్‌ బోగీలుంటాయి.