My title

ఫీజు కట్టలేదని విద్యార్ధినుల బట్టలూడదీయించారు

బీహార్‌లోని బేగుసరాయ్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బిఆర్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీ స్కూల్‌లో అక్కాచెల్లెళ్ళయిన ఇద్దరు విద్యార్ధినులు సకాలంలో స్కూల్‌ యూనిఫామ్‌ ఫీజు కట్టలేకపోయారు. అందుకు ఆగ్రహించిన స్కూల్‌ కరస్పాండెంట్‌, ఆ స్కూల్‌ టీచర్‌ ఆ ఇద్దరు విద్యార్దినుల చేత బట్టలూడదీయించారు. విషయం బయటకి పొక్కడంతో ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.