My title

ఆ హీరోయిన్ ను పెళ్లాడ్డం లేదు

తమిళ హీరో శింబు క్లారిటీ ఇచ్చేశాడు. సీజన్ కు ఒకసారి అతడి పెళ్లిపై ఏదో ఒక పుకారు రావడం కామన్ అయిపోయింది. తాజాగా కూడా అలాంటిదే ఓ పుకారు వచ్చింది. నటి ఒవియాను శింబు పెళ్లాడబోతున్నాడంటూ తమిళ మీడియా వరుసపెట్టి కథనాలు ప్రచురించింది. దీనికి కారణం శింబు తన ట్విటర్ ఎకౌంట్ లో ఒవియాను పెళ్లాడతానని చెప్పడమే. కాకపోతే తర్వాత అందరికీ అర్థమైన విషయం ఏంటంటే అది శింబు ట్విట్టర్ ఖాతా కాదు.

తనపై వచ్చిన వార్తల్ని ఖండిస్తూ శింబు ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఇలాంటి వార్తలు, వివాదాలు తనకు కొత్తకాదని తెలిపిన శింబు.. ఒవియాను తను పెళ్లిచేసుకోవడం లేదని ప్రకటించాడు. ఇకపై తనపై ఎలాంటి వార్తలు వచ్చినా నమ్మొద్దని, తన నుంచి ఓ స్పష్టత తీసుకున్న తర్వాతే ప్రచురించాలని మీడియాకు విజ్ఞప్తి చేశాడు.

ఇంతకీ ఈ ఒవియా ఎవరనే కదా మీ డౌట్. ప్రస్తుతం తమిళనాట కమల్ హాసన్ వ్యాఖ్యాతగా బిగ్ బాస్ కార్యక్రమం నడుస్తున్న విషయం తెలిసిందే కదా. రోజుకో వివాదంతో దూసుకుపోతున్న ఈ కార్యక్రమంతో ఒవియా ఒక్కసారిగా పాపులర్ అయింది. ఇప్పుడు ఈ ఫేక్ ట్వీట్ తో మరోసారి ఆమె పేరు తమిళనాట మారుమోగిపోయింది.