My title

శృతిహాస‌న్ డిక్ష‌న‌రిలోనే లేద‌ట ఆ ప‌దం..!

ఇంట‌ర్నేష‌న‌ల్  స్టార్  క‌మ‌ల్ హాస‌న్ త‌న‌య‌గా  వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన శృతిహాస‌న్.. కెరీర్ ప్రారంభంలో వ‌రుస ఫెయిల్యూర్స్ తో  ఐర‌న్ లెగ్ అనిపించుకంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంతో   అమ్మ‌డు దశ తిరిగింది.  ఒక్క‌సారిగా  స్టార్ హీరోయిన్ స్టేట‌స్ వ‌చ్చింది. తెలుగు..త‌మిళ్..హింది  ప‌రిశ్ర‌మ‌ల నుంచి ఆఫ‌ర్ల వ‌ర్షం వెలువెత్తింది.   అయితే  గ‌బ్బ‌ర్ సింగ్ త‌రువాత   ఆ రేంజ్ హిట్  ప‌డ‌క పోయినా  శృతిహాస‌న్ కు వ‌చ్చిన ప్ర‌మాదం ఏమి లేదు.

క‌ట్ చేస్తే..  ఇక త‌న చిన్న‌ప్ప‌టి నుంచి త‌ను చేయ‌లేను అన్నప‌నుల్ని చేసి చూపించేద‌ట‌.  సినిమాల ప‌రంగా  ఏదైనా చిత్రంలో  రోల్ చేయ‌లేక భ‌య‌ప‌డి  వ‌దులుకున్న సంద‌ర్భం వుందా అంటే..  అస‌లు భ‌యం అనే ప‌దానికి  నా డిక్ష‌న‌రిలోనే ప్లేస్ లేద‌ని  క్లారిటి ఇచ్చింది. త‌ను స్క్రిప్ట్ న‌చ్చ‌క వ‌దుల‌కున్న‌వి ఉన్నాయి కానీ.. చేయ‌డానికి భ‌య‌ప‌డి  వ‌ద‌లుకున్న‌వి ఒక్క‌టి కూడా లేద‌ని చెప్పింది.చిన్న‌ప్పుడు సంగీతం… ఆట‌ల‌పై శ్ర‌ద్దతో  చ‌దువుని నిర్ల‌క్ష్యం చేసేద‌ట‌.  అయితే ఎగ్జామ్స్ స‌మ‌యంలో క‌ష్ట‌ప‌డి మంచి మార్కులు తెచ్చుకునేద‌ట‌. ముందు క‌ష్ట‌ప‌డదాం అనే మ‌న‌స్థ‌త్వంతో త‌ను ఏదైన చేయ‌డానికి సిద్దం అవుతుంద‌ట‌. ఆ యాట్యీట్యూడ్ త‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ ప‌డుతుందిని చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం  త‌మిళ చిత్రాల‌తో  బిజీగా వున్న శృతి    ఈ మ‌ధ్య తెలుగులో   కాట‌మ‌రాయుడు చిత్రంలో  మెరిసింది. ఇక తండ్రి క‌మ‌ల్ హాస‌న్ లీడ్ రోల్ లో వ‌స్తున్న శ‌భాష్ నాయుడు చిత్రంలో కూడా  క‌మ‌ల్ తో క‌లిసి న‌టించింది. ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్దం అవుతుంది.