My title

శృతి హాసన్.. కత్తిలాగుంది

సంఘమిత్ర పేరుతో వస్తున్న చారిత్రక సినిమాలో.. శృతిహాసన్ వీరనారిగా నటిస్తోంది. ఆ కేరెక్టర్ కోసం.. గ్లామర్ డాల్ శృతి.. రకరకాల ఫీట్లు చేస్తోంది. ప్రస్తుతం లండన్ లో.. శృతి కత్తి సాములో ట్రయినింగ్ తీసుకుంటోంది. ఇన్నాళ్లూ.. డ్యాన్సుల్లో.. సింగింగ్ లో.. యాక్టింగ్ లో అదుర్స్ అనిపించుకున్న శృతి.. ఇప్పుడు తన కత్తి విన్యాసాలతో కూడా వావ్ అనిపించుకునేందుకు.. అవసరమైన శిక్షణ పొందుతోంది.

శృతి కత్తిసాము నేర్చుకుంటున్న ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్టిల్స్ లో ఆమె కత్తిలాగుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సుందర్ సి దర్శకత్వంలో వస్తున్న సంఘమిత్రలో.. మన శృతి హాసన్ యువరాణిగా కనిపిస్తోంది. ఆ కేరెక్టర్ కు అవసరం కాబట్టే.. ఇలా రిస్కీ ఫీట్ చేస్తోంది.