My title

మాస్ ఇమేజ్ వైపు అడుగులు వేస్తున్న శర్వానంద్

ప్రస్తుతం యువ హీరో శర్వానంద్ వరుస సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నాడు. పెద్ద హీరోల సినిమాలతో పోటీకి వస్తూ మరి హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంటున్న శర్వాకి ఇప్పుడు ఒక కోరిక మిగిలిపోయిందట. అవును మాస్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో నటించాలనేది శర్వానంద్ కల అంట. అతని సినిమాల్లో హీరోలని చాలా డిఫరెంట్‌గా చూపిస్తాడని, ఆ స్టయిల్‌ తనకి నచ్చుతుందని, పూరితో సినిమా చేస్తే ఖచ్చితంగా తనని డిఫరెంట్‌గా చూపిస్తారని, ఆయనతో పని చేయడం కోసం ఎదురు చూస్తున్నానని డైరెక్ట్ గా తన కోరికను పబ్లిక్ గా చెప్పేసాడు శర్వానంద్.

అయితే గత కొంత కాలంగా పూరి జగన్నాధ్ కి పేరుకి తగ్గ హిట్స్ లేవు. పైగా ఇప్పుడు ఏ ఒక్క స్టార్ హీరో కూడా పూరి జగన్నాధ్ తో మూవీ చేయడానికి ఇష్టపడట్లేదు. అలాంటి ఈ టైంలో శర్వానంద్ పూరితో సినిమా తీస్తే అతని కెరీర్ కి బాగా దెబ్బ పడుతుంది అని అంటున్నారు జనాలు. కాని కొంత మంది విమర్శకులు మాత్రం శర్వానంద్ ఈ క్లీన్ బాయ్ ఇమేజ్ నుంచి బయటపడి మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలి అనే ప్రాసెస్ లో పూరి జగన్నాధ్ తో సినిమా చేయాలని ఉంది అని చెప్పాడు అని అంటున్నారు. శర్వానంద్ ఈ  మాస్ ఇమేజ్ కోసం తాపత్రేయపడి ఉన్న ఇమేజ్ ని పోగొట్టుకోకుండా ఉంటే చాలు అంటున్నారు ఫిలిం నగర్ జనాలు.