My title

సీనియ‌ర్‌ హీరోతో న‌మిత డేటింగ్‌

హాట్ హాట్ ఐటెం గ‌ర్ల్ న‌మిత‌పై ఇప్పుడో మ‌సాలా వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది.  ఈ భారీ అందాల సుంద‌రి డేటింగ్‌లో ఉంద‌ట‌. ఇది హైద‌రాబాద్ ఫిల్మ్‌న‌గ‌ర్ నుంచి వ‌చ్చిన వార్త కాదు. చెన్నై కోలీవుడ్ నుంచి వ‌చ్చిన హాట్ న్యూస్‌. ఒకప్ప‌టి హీరో, కేర్‌క్ట‌ర్ ఆర్టిస్ట్ శ‌ర‌త్‌బాబుతో ఆమె రిలేష‌న్‌షిప్‌లో ఉంద‌నే విష‌యం ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. శ‌ర‌త్‌బాబుతో ఆమె క‌లిసి ఉంటుంద‌ని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవ‌ల ఆమె త‌మిళ బిగ్‌బాస్ షోలో పాల్గొంది. అయితే షోలో ఆమెకు అంత‌గా పేరు రాలేదు. ఇటీవ‌ల సినిమాలు కూడా త‌గ్గిపోయాయి. దీంతో ఆమెను క‌ష్టాలు వెంటాడుతున్నాయి. అయితే ఇప్పుడు 60 ఏళ్ల న‌టుడితో ల‌వ్‌లో ప‌డింద‌నే పుకార్లు వినిపిస్తున్నాయి.

ఒక‌ప్పుడు హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ఆమె…ఇప్పుడు అవ‌కాశాల్లేక ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు తెలిసింది.  త‌న‌ను జ‌నం మ‌రిచిపోవ‌ద్ద‌ని త‌మిళ బిగ్‌బాస్‌లో కూడా పాల్గొంది. అయితే అందులో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఈ షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత శ‌ర‌త్‌బాబుతో డేటింగ్‌కు వెళ్లిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు శ‌ర‌త్‌బాబుకు ఇప్ప‌టికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొద‌ట సీనియ‌ర్ కేర్‌క్ట‌ర్ ఆర్టిస్టు ర‌మాఫ్ర‌భ‌ను ఆయ‌న పెళ్లి చేసుకున్నాడు. ఆత‌ర్వాత వాళ్లిద్దరూ వీడిపోయారు. ఆత‌ర్వాత మ‌రో న‌టిని శ‌ర‌త్ బాబు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెతో కూడా దూరంగా ఉంటున్న‌ట్లు తెలిసింది. ఇప్పుడు న‌మిత‌తో డేటింగ్‌తో ఆయ‌న కూడా చాలా రోజుల‌కు వార్త‌ల్లోకి వ‌చ్చారు.