My title

తమిళ 100% లవ్ రీమేక్ లో శాలిని పాండే

తెలుగు లో సుకుమార్, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన మూవీ “100% లవ్”. తెలుగు యూత్ లో ఈ మూవీకి మంచి వాల్యూ ఉంది. అయితే ఈ మూవీని ఇప్పుడు తమిళ్ లో “100% కాదల్” గా రీమేక్ చేయనున్నారు. జివి ప్రకాష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా లో మొదట లావణ్యని హీరోయిన్ గా అనుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ ఆమె తప్పుకోవడంతో డైలమాలో పడిన మేకర్స్ అలోచించి షాలిని పాండే ని ఫైనల్ చేసుకున్నారట. ఈ తమిళ రీమేక్ ని సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన చంద్రమౌళి డైరెక్ట్ చేయనున్నారు.

అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించిన శాలిని పాండే నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. దాంతో ఆమెకు ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా నుంచి వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. నాగ్ అశ్విన్ మహానటి సినిమాలో సైతం సావిత్రి స్నేహితురాలు జమున పాత్రలో నటిస్తుంది షాలిని పాండే. ఇప్పుడు ఈ తమిళ రీమేక్ లో కూడా లావణ్య త్రిపాటి పుణ్యమా అని శాలినికి హీరోయిన్ ఛాన్స్ వచ్చేసింది. అలాగే తెలుగులో శాలినికి కొంత మంది ప్రొడ్యూసర్స్ అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ బ్లాక్ చేయించుకున్నారట. మొత్తానికి “అర్జున్ రెడ్డి” మూవీతో శాలిని పాండే దశ తిరిగింది అని చెప్పొచ్చు.