My title

మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన “అర్జున్ రెడ్డి” హీరోయిన్

“అర్జున్ రెడ్డి” మూవీ తో విజయ్ దేవరకొండ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. మరో పక్క “అర్జున్ రెడ్డి” లో విజయ్ సరసన నటించిన శాలిని పాండే కూడా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్ అయిన “మహానటి” లో వన్ అఫ్ ది లీడ్ రోల్ ని పోషిస్తుంది శాలిని పాండే. ఈ మూవీ లో సమంతా, కీర్తీ సురేష్ లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది శాలిని పాండే. ఇదిలా ఉంటే అటు తమిళ్ లో కూడా క్రేజీ ప్రాజెక్ట్ అయిన “100 % కాదల్” లో కూడా శాలిని పాండేని మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు మేకర్స్. తెలుగు లో వచ్చిన “100 % లవ్” కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో జీవి ప్రకాశ్ కుమార్ హీరో గా నటిస్తున్నాడు.

ఇకపోతే ఈ భామకి మరో లక్కీ ఛాన్స్ వచ్చిందట.అదేంటంటే మలయాళంలో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగిన దుల్కర్ సల్మాన్ సరసన షాలిని నటించబోతోందట. దుల్కర్ సల్మాన్ “ఓకే బంగారం” సినిమాతో తమిళ, తెలుగు భాషల్లోనూ మంచి పేరు సంపాదించాడు. అదే తరహాలో ఇప్పుడతను తెలుగు-తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం చేయబోతున్నాడట. ఆర్ ఏ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న ఈ మూవీలో శాలిని పాండేని లీడ్ రోల్ లో తీసుకున్నారట. మొత్తానికి అటు తమిళ్ ఇటు తెలుగుతో మళయాళ ఇండస్ట్రీని కూడా కవర్ చేస్తూ కెరీర్ గ్రాఫ్ ని పెంచుకుంటుంది శాలిని.