My title

తన హాట్ పోస్టర్ ని తనే రిలీజ్ చేసుకున్న హీరోయిన్

శర్వానంద్ హీరో గా చేసిన “రన్ రాజా రన్” మూవీ తో ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయ్యింది సీరత్ కపూర్. ఆ మూవీ సక్సెస్ తరువాత సీరత్ కపూర్ కి తెలుగు లో వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే ఈ అమ్మడు లేటెస్ట్ మూవీ అయిన “రాజు గారి గది 2” రేపు గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. నాగార్జున లీడ్ లో నటించిన ఈ మూవీ లో సీరత్ కపూర్ కి ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తుందట. ఇదిలా ఉంటే ఈ మూవీ లో సీరత్ కపూర్ తొలి సారి బికినీ వేసి హాట్ గా కనిపించబోతుంది.

అయితే ఈరోజు తన బికినీ స్టిల్ తో ఉన్న పోస్టర్ తానే రిలీజ్ చేసింది సీరత్ కపూర్. యెల్లో కలర్ టూ పీస్ బికినీ లో ఉన్న ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. కానీ ఈ బికినీ సీన్ ని మాత్రం సెన్సార్ సభ్యులు మూవీ లో నుంచి తొలగించేసారు అని తెలుస్తుంది. ఓంకార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో సమంతా కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. “రాజు గారి గది”కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ పై సీరత్ కపూర్ బాగానే ఆశలు పెట్టుకుంది.