My title

కన్నడనాట బాహుబలి-2 విడుదలకు లైన్ క్లియర్

కన్నడిగులపై సత్యరాజ్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం శాండిల్ పుడ్ లో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కావేరీ నదీ జలాల వివాదం సమయంలో దాదాపు 9 ఏళ్ల కిందట సత్యరాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అవి. ఆ కామెంట్స్ ను బాహుబలి-2 రిలీజ్ టైమ్ లో బయటకు లాగాారు. సినిమాను రిలీజ్ కానివ్వమని పలు సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఒక దశలో దర్శకుడు రాజమౌళి కూడా కన్నడలో మాట్లాడి మరీ విజ్ఞప్తిచేశాడు. అయినప్పటికీ సంఘాలు శాంతించకపోవడంతో ఎట్టకేలకు సత్యరాజ్ రంగంలోకి దిగారు. కన్నడిగులకు క్షమాపణలు చెప్పారు.

9ఏళ్ల కిందట కావేేరీ నదీ జలాల వివాదం సమయంలో అందరు తమిళ ప్రముఖుల్లానే తను కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని, దురదృష్టవశాత్తు తన వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాల్ని దెబ్బతీశాయని సత్యరాజ్ అంగీకరించారు. కన్నడిగులకు తను క్షమాపణలు చెబుతున్నానని, తన మూలంగా బాహుబలి-2 విడుదలను అడ్డుకోవద్దని కోరారు.

ఓవైపు క్షమాపణలు  చెబుతూనే మరోవైపు తమిళ ప్రజలకు ఓ విజ్ఞప్తి కూడా చేశారు సత్యరాాజ్. తను ఎలాంటి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందో తమిళులు అర్థం చేసుకోవాలని కోరాారు. భవిష్యత్తులో తమిళ ప్రజల హక్కులు, సమస్యల పట్ల పోరాటం సాగించడానికి తను ఎప్పుడూ ముందుంటానని ప్రకటించారు. మొత్తమ్మీద సత్యరాజ్ క్షమాపణలతో బాహుబలి-2 కన్నడ రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది.