My title

రణ్ బీర్ ను అలా చూసి షాక్ అయిపోయింది

సంజయ్ దత్ బయోపిక్ కోసం చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్ చాలా కష్టపడుతున్నాడు. సంజూ లుక్ కోసం రకరకాల ట్రయల్స్ వేసిన రణ్ బీర్.. ఫైనల్ గా నుదుటన తిలకం.. చిన్న కటింగ్.. తెల్లగడ్డంతో.. అచ్చు.. సంజయ్ దత్ లాగే కనిపిస్తున్నాడు. అతని కమిట్ మెంట్ చూసి.. బాలీవుడ్ జనాలే షాక్ అవుతున్నారు.

ఇప్పుడు.. సంజయ్ సిస్టర్ ప్రియా దత్ కూడా.. ఆ లిస్ట్ లో చేరిపోయింది. రణ్ బీర్ గెటప్ చాలా బాగుంది.. చూడ్డానికి సేమ్ టు సేమ్ సంజయ్ దత్ లానే కనిపిస్తున్నాడు అంటూ.. ప్రియ చెప్పుకొచ్చింది. సంజయ్ రియల్ లైఫ్ ను.. రీల్ లైఫ్ లో చేయగలిగేది రణ్ బీర్ ఒక్కడే అని తాను మొదటి నుంచి నమ్ముతున్నానని చెప్పింది.

ఇలా.. తన కేరెక్టర్ కమ్ కమిట్ మెంట్ తో టాక్ ఆఫ్ ద బాలీవుడ్ అవుతున్న రణ్ బీర్.. సినిమా కోసం బాగానే రిస్క్ తీసుకుంటున్నాడు. సంజయ్ లుక్ వచ్చేందుకు గడ్డం పెంచి.. నుదురుపై జుట్టు తగ్గించిన రణ్ బీర్.. 13 కిలోల బరువు కూడా పెరిగాడు. సంజయ్ లైఫ్ లోని పరిణామాలన్నీ.. ఈ మూవీలో చూపించబోతున్నాడు.