My title

నిజమే… సమంత దెయ్యంగా మారిపోయింది…

రాజుగారి గది-2 ప్రాజెక్టులోకి సమంత ఎంటర్ అయిందనగానే అందరూ ఫిక్స్ అయిపోయారు. కచ్చితంగా సమంత దెయ్యం పాత్రలో కనిపిస్తుందని ఊహించారు. దీనికి తోడు బ్లాక్ డ్రెస్ లో సమంత అప్పట్లో ఓ ఫొటో రిలీజ్ చేసింది. దీంతో అంతా ఫిక్స్ అయిపోయారు. తాజా సమాచారం ప్రకారం, రాజుగారి గది-2లో సమంత దెయ్యం లేదా ఆత్మలా కనిపించబోతోంది.  ప్రస్తుతం నెట్ లో ఇదే స్పెక్యులేషన్ నడుస్తోంది.

రాజుగారిగది-2లో సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఓ కీలకపాత్ర కోసం సమంతను తీసుకున్నారు. అయితే సమంత ఇందులో దెయ్యంగాా కనిపించనుందా లేదా ఆత్మలా కనిపించనుందా అనే విషయంపై మాాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈనెలాఖరుకు రాజుగారి గది-2 సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.

ప్రస్తుతం సమంత విలక్షణ పాత్రలపై దృష్టిపెట్టింది. రాజుగారి గది-2లో ఆత్మలా కనిపించనుంది. రామ్ చరణ్ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తోంది. అటు తమిళనాట కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటోంది.