My title

చైతు-నేను రెండు సార్లు కాదు…. మూడు సార్లు పెళ్లి చేసుకున్నాం 

త‌మ‌పెళ్లి గురించి  సమంత ప‌లు ఆస‌క్తిక‌మైన విషయాల్ని వెల్ల‌డించింది. గోవాలోనే  పెళ్లెందుకు చేసుకున్నార‌ని ఈ కొత్త‌పెళ్లి కూతుర్ని అడిగితే సిగ్గులు మొగ్గ‌లు తొడుగుతూ…. గోవాలో జ‌రిగిన పెళ్లి  పేరుకు మాత్ర‌మేన‌ని…. కానీ త‌మ‌పెళ్లి ఎప్పుడో జ‌రిగింద‌ని చెప్పుకొచ్చింది. అంతేకాదు మ‌న అనుకున్న‌వాళ్ల‌ని ఆనందంగా ఉండేలా చూసుకోవ‌డం తమ ఇద్దరికీ చాలా ముఖ్యమని…. అందుకే పెళ్లికి ఖ‌ర్చు భారీ ఎత్తున కాకుండా సింపుల్ గా గోవాలో చేసుకున్న‌ట్లు తెలిపింది.

భారీ ఎత్తున పెళ్లికి ఖ‌ర్చు చేస్తే మ‌న‌వాళ్లు ఎలా ఫీల‌వుతున్నారో తెలీదు. వాళ్ల‌ని బాధ‌పెట్ట‌డం ఇష్టం లేక‌నే పెళ్లిని పూర్తి ప్రైవేటు కార్యక్రమంగా గోవాలో చేసుకున్నామని స‌మంత‌ వెల్లడించింది. ఇక యాక్టింగ్ ప‌రంగా ఉత్త‌మంగా న‌టించాల‌ని ఎంత ట్రై చేసినా ఇప్ప‌టి వ‌ర‌కు అలా జ‌ర‌గ‌లేద‌ని.. ఉత్తమ పాత్రల్లో నటించే దిశగా పయనిస్తున్నానని సమంత చెప్పుకొచ్చింది.