My title

కర్రసాము నేర్చుకున్న సమంత

వెండితెరపై ముద్దుముద్దుగాా కనిపించి, హీరోలకు లేలేత ముద్దులిచ్చి, కూసింత అందాలు చూపించి కూల్ గా కనిపించే హీరోయిన్లు… తెరవెనక కూడా అలానే ఉంటారని చాలామంది అనుకుంటారు. దీనికి కొందరు ముద్దుగుమ్మలు మినహాయింపు. కావాలంటే సమంతను చూడండి మీకే అర్థమౌతుంది. వెండితెరపై అందంగా, నాజూగ్గా కనిపించి మైమరిపించే ఈ బ్యూటీ రియల్ లైఫ్ లో మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. శభాష్ అనిపించుకుంటోంది

ఏదైనా ఛాలెంజ్ ను తీసుకోవడం సమంతకు బాగా అలవాటు. అందులో భాగంగా ఈ బ్యూటీ కర్రసాము నేర్చుకుంది. ఆ వీడియోను ఈరోజు ఉదయాన్నే సోషల్ మీడియాలో పెట్టింది. నిజంగా అందులో సమంత కర్రసాము చూసి జనాలకు పిచ్చెక్కింది. సమంత ఏంటి, ఇంత బాగా కర్రసాము చేస్తోంది అంతా ఆశ్చర్యపోయారు. నిజమే, సమంత అద్భుతంగా కర్రసాము చేసింది.

ఇలాంటి ఛాలెంజెస్ తీసుకోవడం సమంతకు ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలో ఆమె అమాంతం బరువులు ఎత్తేసింది. కేవలం వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకాారులకు మాత్రమే సాధ్యమయ్యే వెయిట్స్ ను అమాంతం లేపేసి… ఇది మహిళా శక్తి అంటూ ట్వీట్ కూడాా పెట్టింది. ఇప్పుడు కర్రసాముతో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో వైరల్ అవుతుంది. ఇప్పటికే కొన్నిలక్షల మంది దీన్ని చూశారు.