My title

రేపట్నుంచి సెట్స్ పైకి సమంత

పెళ్లి తర్వాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వనని ప్రకటించింది సమంత. చెప్పినట్టుగానే షార్ట్ గ్యాప్ తర్వాత సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. అవును.. రేపట్నుంచి సమంత మళ్లీ సినిమాలతో బిజీ అయిపోనుంది. ఇప్పటికే రాజుగారి గది-2 ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన ఈ అక్కినేని కోడలు పిల్ల.. రేపట్నుంచి మహానటి షూటింగ్ ను స్టార్ట్ చేయబోతోంది. ఇప్పటికే ఇచ్చిన కాల్షీట్ల ప్రకారం.. మహానటి సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే.. రంగస్థలం సినిమా సెట్స్ పైకి షిఫ్ట్ అవుతుంది సమంత.

ఆగస్ట్ 6,7 తేదీల్లో పెళ్లి చేసుకుంది సమంత. 6వ తేదీన హిందూ సంప్రదాయంలో, 7న క్రిస్టియన్ పద్ధతిలో నాగచైతన్యను పెళ్లాడింది. అలా పెళ్లి చేసుకొని వారం రోజులైనా తిరక్కముందే మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయింది. అటు నాగచైతన్య మాత్రం ఇంకా సెట్స్ పైకి రాలేదు. యుద్ధం శరణం సినిమాను రిలీజ్ చేసిన ఈ హీరో.. ఈనెల 15 నుంచి సవ్యసాచి సినిమాను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. కాకపోతే ఆ తేదీ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అదే కనుక జరక్కపోతే.. మరికొన్ని రోజులు నాగచైతన్యకు రెస్టే.