My title

అసలు కొన్ని సినిమాల్లో నేను ఎందుకు ఉన్నానో నాకే తెలియదు- సమంతా

మొత్తానికి నాగ చైతన్య ,సమంతా ఒక్కటయ్యారు .వాళ్ళ పెళ్లి పనులు కూడా అన్ని అయిపోయాయి. అయితే సమంతా పెళ్లి తరువాత బ్రేక్ తీసుకోకుండా వెంటనే “రాజు గారి గది 2” ప్రమోషన్స్ లో బిజీ అయిపొయింది. అక్కినేని ఫ్యామిలీ గురించి సమంతా మాట్లాడుతూ “అక్కినేనిగా నాపై బోలెడంత బాధ్యతను మోపినట్లుగా అనిపిస్తోంది. అందరి అంచనాలను నిలబెట్టుకుంటానని నాపై నాకు నమ్మకం ఉంది. అక్కినేని వారింట్లో మహిళలను పురుషులతో సమానంగా చూడడం అనే విషయం తనకు ఎంతగానో నచ్చింది” అని అక్కినేని వారి గొప్పతనం గురించి చెప్పింది సమంతా.

ఇదిలా ఉంటే “రాజు గారి గది 2” లో సమంతా పాత్ర ఎలా ఉంటుంది అనే అడిగితే “ఈ మూవీలో నాది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, ముందు ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ దొరికినందుకు చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్న, అసలు ఇన్ని రోజులు కొన్ని సినిమాల్లో నేను ఎందుకు ఉన్నానో ఎందుకు వస్తానో కూడా అర్ధం అయ్యేది కాదు, కాని “రాజు గారు గది 2″ అలాంటి సినిమా కాదు” అని చెప్పింది. అందరిని షాక్ కి గురి చేసింది సమంతా. మరి సమంతా తనకి స్టార్ డం తెచ్చిన కమర్షియల్ మూవీస్ పై ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చింది అనేది ఎవరికీ అర్ధం అవ్వడం లేదు. మరి పెళ్లి అయ్యింది కాబట్టి ఇకపై సమంతా ఎలాంటి క్యారెక్టర్స్ ని ఓకే చేస్తుందో చూడాలి.