My title

ఇక అక్కినేని సమంత

సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి అయితే ఆడ‌వాళ్ల పేర్లు మారుతాయి. వారి పేరు ప‌క్క‌న భ‌ర్త ఇంటి పేరు వ‌చ్చి చేరుతుంది. ఇప్పుడు హీరోయిన్ స‌మంతా ప‌క్క‌న అక్కినేని ఇంటిపేరు వచ్చి చేరింది. ఇటు పెళ్లి నాలురోజులైందో లేదో….అప్పుడు స‌మంతా త‌న ఇంటిపేరు మార్చుకున్నారు. సోష‌ల్ మీడియాలో త‌న అకౌంట్ల పేర్ల‌ను స‌మంత అక్కినేనిగా మార్చారు. ఇంత‌కుముందు ఆమెపేరు స‌మంత రుత్ ప్ర‌భు అనే ఉండేది. కానీ ఇవాళ ఆమె దాన్ని ‘సమంత అక్కినేని’ అని ఎడిట్‌ చేశారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఆమె పేరు రుత్‌ ప్రభు అనే ఉంది. ప్ర‌స్తుతం స‌మంత న‌టించిన రాజుగ‌రి గ‌ది-2 విడుద‌ల కాబోతుంది. దీంతో పాటు త‌మిళంలో విజ‌య‌స‌ర‌స‌న న‌టించిన ‘అదిరింది’ కూడా దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. దీంతో పెళ్లి త‌ర్వాత విడుద‌ల కాబోతున్న ఈసినిమాల రిజ‌ల్ట్‌పై కూడా స‌మంత టెన్ష‌న్‌తో ఉన్నార‌ట‌.