My title

సైలెంట్ గా స్టార్ట్ అయిన సాయిధరమ్ తేజ్ సినిమా

ఓవైపు ఇండస్ట్రీ మొత్తం మహేష్ వైపు చూసింది. ఎక్కడ చూసినా మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలే కనిపించాయి. మరోవైపు స్పైడర్ సినిమా టీజర్ రిలీజైంది. ఈ రెండు విషయాలు డామినేేట్ చేయడంతో సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ఓపెనింగ్ ను ఎవరూ పట్టించుకోలేదు. దీనికి తోడు తేజూకు సరైన సక్సెస్ లు కూడా లేకపోవడంతో కొత్తగా ప్రారంభమైన సినిమాపై ఎవరికీ హోప్స్ లేవు. కాకపోతే ఇది వినాయక్ సినిమా, ఓపెనింగ్ కు మెగాస్టార్ వచ్చిన సినిమా. కాబట్టి కొంచెం ఎట్రాక్ట్ చేసింది.
వినాయక్-సాయిధరమ్ తేజ్ కాంబోలో ఈరోజు కొత్త సినిమా ఓపెన్ అయింది. ఖైదీ నంబర్ 150 తర్వాత వినాయక్ చేస్తున్న మూవీ ఇదే. వచ్చే నెల మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఎంపికైంది. సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.
మెగాస్టార్‌ చిరంజీవి చిత్ర యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌ అంటూ అందించిన ఆశీస్సులతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. హీరో సాయిధరమ్‌తేజ్‌పై తీసిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్‌ నివ్వగా, మరో ప్రముఖ రచయిత సత్యానంద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ చిత్రానికి కథ, మాటలు అందించిన ఆకుల శివ ఫస్ట్‌ షాట్‌ని డైరెక్ట్‌ చేశారు. హీరో సాయిధరమ్‌ తేజ్‌ తల్లిగారైన శ్రీమతి విజయదుర్గ స్క్రిప్ట్‌ని అందించారు.