My title

పేరెంట్స్ అనుమతి లేనిదే అలాంటి సీన్స్ చేయను అంటున్న సాయి పల్లవి

ఫిదా మూవీ తో శేఖర్ కమ్ముల మన తెలుగు తెరకి సాయి పల్లవి అనే ఒక మళయాళ ముద్దు గుమ్మని పరిచయం చేశాడు. మలయాళ చిత్రం అయిన ప్రేమమ్ తో మన తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కొల్ల గొట్టిన సాయి పల్లవి తెలుగు లో వచ్చిన ఫిదా తో మళ్లీ అందర్నీ మాయ చేసింది. ఫిదా హిట్ తో తెలుగు లో ఒక రేంజ్ లో దూసుకుపోతున్న సాయి పల్లవి తన రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసింది. ప్రొడ్యూసర్స్ కూడా ఆమె క్రేజ్ ని క్యాష్ చేసుకుందాం అని  సాయి పల్లవి అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.

అయితే ప్రొడ్యూసర్స్ తాము ఇచ్చిన రెమ్యూనరేషన్ కు జస్టిఫికేషన్ అవ్వాలని చెప్పి సాయి పల్లవిని ఇంటిమేట్ సీన్స్ లో నటించమంటున్నారట. కానీ సాయి పల్లవి మాత్రం అందుకు “నో” చెప్తుందట.  సాయి పల్లవి ఇండస్ట్రీ లో ఇప్పుడు ఈ రేంజ్ లో ఉండటానికి కారణం ఆమె పేరెంట్స్ అంట, అందుకే తన పేరెంట్స్ కి ఇబ్బంది కలిగించే సీన్స్ లో తాను నటించను అని ప్రొడ్యూసర్స్ కి చెప్పేస్తుంది  ఈ మళయాళ ముద్దు గుమ్మ. ప్రొడ్యూసర్స్ కూడా ఇక చేసేదేమీ లేక సాయి పల్లవిని ఎక్కువ ఫోర్స్ చేయట్లేదు అని బయట ఫిల్మ్ నగర్ టాక్. మొత్తానికి తన పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ ని ఫ్రీడమ్ ని మిస్‌యూస్ చేసుకోవద్దు అని సాయి పల్లవి ఫీలింగ్.