My title

సుప్రీమ్ హీరో మరోసారి దూసుకొస్తున్నాడు

ఈ మధ్య కాలంలో సరైన విజయాల్లేవ్ సాయిధరమ్ తేజకు. ఎన్నో అంచనాల మధ్య చేసిన విన్నర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అంతకంటే ముందొచ్చిన తిక్క సినిమా డిజాస్టర్. నక్షత్రం సినిమాలో ఉన్నాడు కానీ హీరో కాదు. సో.. ఇప్పుడు సాయిధరమ్ తేజ ఆశలన్నీ జవాన్ సినిమాపైనే ఉన్నాయి.

మాటల రచయిత బీవీఎస్ రవిని దర్శకుడిగా పరిచయం చేస్తూ జవాన్ సినిమా చేస్తున్నాడు తేజూ. ఏకథాటిగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఈ నెలాఖరుకు మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభమైంది. సెప్టెంబర్ 1న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు.

జవాన్ ముూవీలో సాయిధరమ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. అరుణాచల్ మూవీస్ బ్యానర్ పై కృష్ణ ఈ సినిమాను నిర్మించారు.