My title

జవాన్ పై ఇంకా క్లారిటీగా లేని సాయి ధరమ్ తేజ్….

మెగా ఫ్యామిలీ నుంచి హీరో గా వచ్చి మాస్ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్ లో వరుసగా హిట్స్ మీద హిట్స్ కొట్టి ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నాడు సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ గత చిత్రాలు అయిన “తిక్క”, “విన్నర్” రెండూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలయ్యాయి. అయితే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ఆశలన్నీ తన నెక్స్ట్ మూవీ అయిన “జవాన్” మీదే ఉన్నాయి. బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. అంతా అనుకున్న ప్రకారం జరిగితే సాయిధరమ్ తేజ్  ‘జవాన్’ ఈపాటికే రిలీజైపోవాల్సింది. సెప్టెంబర్ 1 న రిలీజ్ చేసేందుకు డేట్ కూడా మూవీ యూనిట్ అనౌన్స్ చేసారు. అసలు మొదట్లో ఉన్న అగ్రిమెంట్స్ ప్రకారమైతే ఆగస్టు 11కే ఈ చిత్రాన్ని విడుదల చేయాల్సింది. కానీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వల్ల అప్పుడు రిలీజ్ చేయడం కుదర్లేదు. సెప్టెంబరు 1కి అనుకుంటే ‘పైసా వసూల్’ వచ్చి పడింది. ఇక ఇప్పుడు సెప్టెంబర్ లో ఏమో “జై లవ కుశ” ఇంకా “స్పైడర్” రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. మరి ఈ జవాన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే క్లారిటీ ఇంకా సాయి ధరం తేజ్ కి కూడా లేదు. అందుకే మూవీ ఇంకా డీలే అవుతుంది అంటున్నారు ఫిలిం నగర్ జనాలు.