My title

వెనక్కి తగ్గిన ప్రభాస్… ఫస్ట్ లుక్ రద్దు

బాహుబలి-2 క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ఫుల్ సరంజామాతో సిద్ధమైపోయాడు ప్రభాస్. ఇంకా సెట్స్ పైకి రాని తన కొత్త సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ను రెడీ చేశాడు. ఈ ఆదివారం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, 28న బాహుబలి-2తో పాటు టీజర్ విడుదల చేసి.. ఫుల్ గా ప్రమోషన్ కొట్టేద్దామని అనుకున్నాడు. తన నెక్ట్స్ సినిమాకు కూడా నేషనల్ వైడ్ గా ప్రమోషన్ సంపాదించేద్దామని ప్లాన్ చేేశాడు. కానీ ఊహించని విధంగా వెనక్కి తగ్గాడు యంగ్ రెబల్ స్టార్.

అవును.. ప్రభాస్ నెక్ట్స్ సినిమా సాహో ఫస్ట్ లుక్ రిలీజ్ రద్దయింది. ఈ ఆదివారం విడుదల కావాల్సిన ఫస్ట్ లుక్ లాంచింగ్ ను క్యాన్సిల్ చేసినట్టు యూనిట్ ప్రకటించింది. అయితే టీజర్ మాత్రం యాథావిథిగా బాహుబలి-2 సినిమాతో పాటు రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. మరి టీజర్ విడుదల చేస్తున్నప్పుడు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ప్రాబ్లమ్ ఏంటి.. సరిగ్గా ఇక్కడే వెనక్కి తగ్గింది సాహో టీం.

ఆదివారం ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే, టీజర్ పై క్రేజ్ తగ్గిపోతుందనేది సాహో టీం భయం. ఒకవేళ వాళ్ల భయమే కనుక నిజమైతే.. బాహుబలి-2 లాంటి మంచి అవకాశాన్ని క్యాష్ చేసుకోలేకపోయారనే విమర్శలు వస్తాయి. అందుకే ఎందుకొచ్చిన గొడవలే అని, ఫస్ట్ లుక్ రిలీజ్ ను రద్దుచేసినట్టు తెలుస్తోంది.