My title

హోల్డ్ లో పడిపోయిన “టచ్ చేసి చూడు”

మాస్ మహారాజ రవితేజ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న మూవీస్ “రాజా ది గ్రేట్” , “టచ్ చేసి చూడు”. ఈ రెండు కొత్త మూవీస్ ని వెనువెంటనే స్టార్ట్ చేసాడు రవితేజ. ఈ రెండు మూవీస్ ఒకేసారి మొదలైన గాని “రాజా ది గ్రేట్” మాత్రం రిలీజ్ కి రెడీ అవుతుంది. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న “రాజా ది గ్రేట్” మూవీ ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ అక్టోబర్ 12 న రిలీజ్ కి రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రొడక్షన్ దశలో ఉంది. దీని తర్వాత రవితేజ “టచ్ చేసి చూడు” షూట్ కి వెళ్ళాలి కాని రవితేజ షూట్ కి వెళ్ళే ముందు కాస్త బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారట. ఎందుకంటే ఈ చిత్రంలో లుక్ “రాజా ది గ్రేట్” లుక్ కు పూర్తి డిఫరెంట్ గా ఉంటుందట. అందుకే ఆ లుక్ లోకి మారడం కోసం ఆయన కాస్త టైమ్ తీసుకోనున్నారట. మూవీ టీమ్ కూడా ప్రస్తుతం ఇతర పనులు చూసుకుంటూ రవితేజ షూట్లో జాయిన్ అవగానే షూటింగ్ స్పీడ్ అప్ చేయాలనీ ప్లాన్ చేసారట టీం. ఈ చిత్రాన్ని విక్రమ్ సిరికొండ డైరెక్ట్ చేస్తుండగా నల్లమల్లపు బుజ్జి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.