రేటు విషయం లో వెనక్కి తగ్గను అంటున్న రవితేజ

206

మాస్ మహారాజ్ రవితేజ చాలా కాలం తరువాత “రాజా ది గ్రేట్” తో ఆడియన్స్ ముందుకి వచ్చి కామెడీ పువ్వుల్ని పూయించాడు. కామెడీ ఎంటర్‌ టైనర్‌గా హిట్ అయిన ఈ మూవీ కి “పటాస్” ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అయితే “రాజా ది గ్రేట్” ముందు వరకు రవితేజ కి అస్సలు మార్కెట్ లేదు. ఎందుకంటే రవితేజ అప్పుడు ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఇప్పుడు హిట్ వచ్చింది కాబట్టి రవితేజ తన పారితోషకాన్ని అమాంతం పెంచేసాడు. రేటు విషయంలో రవితేజ ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో రవితేజ హీరో గా సినిమాలు చేద్దామని వచ్చిన నిర్మాతలు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు అని టాక్.

కోలీవుడ్ హిట్ మూవీ అయిన “బోగన్” క్యాన్సిల్ వెనుక కారణం రవితేజ రేటు విషయంలో బాగా పట్టుబట్టడమే కారణమని తెలుస్తుంది. ర‌వితేజ ప్రస్తుతం “టచ్ చేసి చూడు” అనే సినిమాను మాత్రమే చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ర‌వితేజ సైన్ చేసిన సినిమా ఒక్క‌టి కూడా లైన్ లో లేదు. ర‌వితేజ ప్ర‌స్తుతం రూ.12 కోట్ల‌కు త‌క్కువైతే సినిమాలు ఒప్పుకునే ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది. ఇలా అయితే రవితేజ తో సినిమా కష్టమే అని నిర్మాతలు భావిస్తున్నారట. మొత్తానికి ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు రవితేజ ఏ తప్పు అయితే చేసాడో ఇప్పుడు మళ్ళీ అదే తప్పుని రవితేజ రిపీట్ చేస్తున్నాడని సినివర్గాలు అంటున్నాయి.

NEWS UPDATES

CINEMA UPDATES