My title

రోజాపై రావెల అనుచిత వ్యాఖ్యలు… జగన్ కు మందేసి తరిమేయాలట..

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి రావెల కిషోర్‌బాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసలు రోజా స్త్రీయేనా అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి…. రోజా, జగన్‌పై విమర్శలు చేశారు. ‘‘చంద్రబాబుపై నోరుజారితే ఖబడ్దార్‌. నాలుకలకు కత్తెరవేస్తాం. సర్జరీ చేస్తాం. రోజా ఏం మాట్లాడుతుందండి. అసలు రోజా ఒక స్త్రీయేనా? స్త్రీజాతి సిగ్గుతో తలొంచుకోవాలి. ఆమె మాటేంటి? ఆమె వేషమేంటి? ఆమె భాషేంటి? ఆమె ప్రవర్తనేంటి? అసెంబ్లీలో బూతులు మాట్లాడేటటువంటి అరాచకవాది రోజా. అలాంటి రోజా కూడా చంద్రబాబును విమర్శిస్తున్నారు’’ అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. ప్రతిపక్ష నేత జగన్‌కు తన భయం పట్టుకుందని రావెల చెప్పుకున్నారు. జగన్, బొత్సవంటి నాయకులు ఈ రాష్ట్రానికి పట్టిన చీడపురుగులని, వాటిని మందు వేసి తరిమికొట్టాలన్నారు.

You may also like below articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen − 6 =