My title

సింగర్ గా మారిన సెక్సీ హీరోయిన్

పాటలు పాడిన సింగర్లు హీరోయిన్లుగా మారిన సందర్భాలున్నాయి. హీరోయిన్లుగా మారిన తర్వాత మరికొందరు సింగర్లుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రెండో కోవకు వస్తుంది రాశీ ఖన్నా. తెలుగులో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సింగర్ అవతారం ఎత్తింది. ఏకంగా ఓ పాట పాడేసింది.

నారా రోహిత్ హీరోగా బాలకృష్ణుడు అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఇప్పుడిదే సినిమాలో పాట పాడింది రాశి ఖన్నా. తను పాట పాడుతున్న ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

పవన్ మల్లెల డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శరత్ చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయాబజార్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నారా రోహిత్ కు 15వ చిత్రం కావడం విశేషం.