My title

దసరా పోయింది…. దీపావళికైనా వస్తుందా…?

రంగస్థలం సినిమాకు సంబంధించి ప్రతి విషయం సస్పెన్స్ గా మారింది. ఈ సినిమా సంక్రాంతికి వస్తుందో రాదో తెలీదు. మూవీ ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ ఏంటే తెలీదు. అనసూయ, సమంత క్యారెక్టర్స్ పై కూడా క్లారిటీ లేదు. వీటికి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన వార్తల్లో ఏ ఒక్క న్యూస్ ను మేకర్స్ నిర్థారించలేదు. చివరికి ఫస్ట్ లుక్ పై కూడా.

రంగస్థలం ఫస్ట్ లుక్ దసరాకు వస్తుందని ఊహించారంతా. పవన్ కల్యాణ్ చేతులమీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తారంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ దసరాకు ఆ ముచ్చట తీరలేదు. సో.. దీపావళికి గ్యారెంటీ అంటూ ఫ్రెష్ గా మరో ప్రచారం మొదలైంది. అది కూడా పవన్ చేతుల మీదుగా దీపావళికి ఫస్ట్ లుక్ వస్తుందంటూ మరో ప్రచారం.

మొత్తమ్మీద రంగస్థలం సినిమాపై దర్శకుడు సుకుమార్ ఎంత సస్పెన్స్ మెయింటైన్ చేయాలో అంతా చేస్తున్నాడు. కాకపోతే ఇక్కడో చిన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. అంచనాలనేవి రియలిస్టిక్ గా పెరిగితే అది సినిమాకు ప్లస్. ఏదేదో ఊహించుకొని భారీ అంచనాలు పెంచుకుంటే రిలీజ్ తర్వాత సినిమాపై అది తీవ్రప్రభావం చూపిస్తుంది.