My title

రానా దగ్గుబాటి కొత్త మూవీ మళ్ళీ స్టార్ట్ అయ్యింది

“బాహుబలి” తరువాత “నేనే రాజు నేనే మంత్రి” మూవీ తో మంచి సక్సెస్ ని అందుకున్నాడు రానా. ప్రస్తుతం “సోషల్” అనే వెబ్ సిరీస్ తో బిజీ గా ఉన్న రానా మరో వైపు “నెంబర్ వన్ యారి” అనే రియాలిటీ షో తో కూడా బిజీ గా ఉన్నాడు. ఇదిలా ఉంటే 1945 లోని బ్రిటిష్ ఇండియా కాలం నాటి ఘటనల ఆధారంగా తమిళ్ – తెలుగులో ఒక పిరియాడిక్ సినిమాను కూడా  చేస్తున్నాడు రానా. ఈ సినిమాకు తమిళ్ లో “మదై తీరంతు” అనే టైటిల్ సెట్ చేయగా తెలుగులో “1945” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మూవీ యూనిట్. ఈ మూవీ మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నాక కొన్ని రోజులు ఆగిపోయింది. మళ్ళీ ఇన్ని రోజుల తరువాత ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా రానానే సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసాడు. సత్యశివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కె ప్రొడక్షన్స్ సంస్థ పై రాజరాజన్ నిర్మిస్తున్నాడు. ఇక రానా ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. రెజీనా, లీషా హీరోయిన్స్ గా నటిస్తుండగా నాజర్ , సత్య రాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ అయ్యే ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.