My title

పాత స‌రుకుల‌ను అంట‌గ‌డుతున్న ప‌తంజ‌లి ?

రాందేవ్ బాబాకు చెందిన ప‌తంజ‌లి సంస్థ చిక్కుల్లో ప‌డింది. ఎక్స్‌పైరీ డేట్ దాటిన స‌రుకుల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు అంట‌గ‌డుతోందంటూ ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కోంటుంది. ఇటీవ‌ల అసోంలో వ‌ర‌ద‌ల కార‌ణంగా స‌ర్వం కోల్పోయి క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు పాత స‌రుకుల‌ను అందించి తమ దాతృత్వం చాటుకుంది. పతంజ‌లి సంస్థ చేసిన ఈ ఘ‌న‌కార్యాన్ని స్థానిక మీడియా ప‌సిగ‌ట్టింది. వ‌ర‌ద బాదితుల‌కు మిల్క్ పౌడ‌ర్‌, జ్యూస్ వంటివి గ‌డువు దాటిన స‌రుకుల‌ని తేలింది. దీంతో అసోంలోని మ‌జౌలీ జిల్లా యంత్రాంగం ఈ అంశాన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. ప‌తంజ‌లి సంస్థ చేసిన ఈ ప‌నిపై ద‌ర్యాప్తు చేయాల‌ని నిర్ణ‌యించింది.

మ‌రోవైపు ప‌తంజ‌లి సంస్థ ఉద్యోగుల వివ‌ర‌ణ మ‌రోలా ఉంది. త‌మ వ‌ద్ద పాత స‌రుకులు ఉన్న మాట వాస్త‌వ‌మే గానీ….వాటిని వ‌ర‌ద బాదితుల‌కు పంపిణీ చేయ‌లేద‌ని వారు తేల్చి చెప్పారు. ప‌తంజ‌లి ఉత్ప‌త్తుల‌ను ఆహారంగా తీసుకోవ‌డంతో చాలా మంది అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను వారు ఖండించారు. త‌మ ప్ర‌తినిధులుగా చెప్పుకుంటూ కొంత మంది  చేసిన పంపిణీకి త‌మ‌కు ఎటువంటి సంబంధం లేద‌ని వారు జాగ్ర‌త్త ప‌డ్డారు. వ‌ర‌ద బాదితుల‌ను ఆదుకోవ‌డానికి మాన‌వ‌తా దృక్ప‌థంతో స్పందించామ‌ని సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు.

జిల్లా అధికార యంత్రాంగం ఆ సంస్థ ప్ర‌తినిధుల‌ను మంద‌లించింది. పాత స‌రుకుల‌ను వెంట‌నే త‌గుల‌బెట్టాల‌ని లేకపోతే త‌మ‌కు స్వాధీనం చేయాల‌ని ఆదేశించింది.