My title

బాలీవుడ్ మూవీలో రాందేవ్ బాబా

రాందేవ్ బాబా.. ఇండియాలోనే కాదు యావ‌త్ ప్ర‌పంచానికి సుప‌రిచ‌తమైన వ్య‌క్తి. ఇప్ప‌టికే యోగా గురువుగా ఉన్నారు. ప‌తంజ‌లి సంస్థ‌కు అధిప‌తిగా ఉన్నారు. స్వ‌దేశీ నినాదంతో మార్కెట్‌లో దూసుకుపోతూ.. ఫారిన్ కంపెనీల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. అంతేకాదు ఎన్నో సేవాకార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హిస్తున్నారు. ఐతే రాందేవ్‌బాబా సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అతిత్వ‌ర‌లోనే సిల్వ‌ర్ స్క్రీన్‌పై త‌ళుకున్న మెరవ‌బోతున్నారు. ఓ హిందీ సినిమాలోని స్పెష‌ల్ సాంగ్‌లో యోగా స్టెప్పుల‌తో అభిమానుల‌ను అల‌రించ‌నున్నారు.

బాలీవుడ్‌లోకి రాందేవ్ బాబా తెరంగ్రేటం చేస్తున్నారు. లోమ్‌ హర్ష్‌ దర్శకత్వం వహిస్తున్న ‘యే హై ఇండియా’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ మూవీలో గ్యావీ చాహెల్‌, డీనా ఉప్ప‌ల్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. టైటిల్‌కు తగ్గట్టుగానే దేశ భక్తి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లండన్‌లో పుట్టి పెరిగిన 25 ఏళ్ల యువకుడు భారత్‌ను ఓ పేద దేశంలా భావిస్తుంటాడు. అనంతరం భారతదేశంలో వస్తున్న మార్పులను చూసి తన అభిప్రాయాన్ని ఎలా మార్చుకుంటాడు అన్న నేపథ్యంలో ఈ మూవీని చిత్రీక‌రించారు. ఇందులో రాందేవ్‌ బాబా ‘సయ్యా సయ్యా’ అనే పాటలో సంద‌డి చేయ‌బోతున్నారు.

రాజస్థాన్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఈ మూవీని చిత్రీక‌రించారు. దేశభక్తి నేపథ్యంలో ఉన్న కథాంశం కాబట్టే రాందేవ్‌బాబా ఈసినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడని నిర్మాత సందీప్‌చౌదరి అన్నాడు. ఆగ‌స్టు 18న మూవీని రిలీజ్‌చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మూవీ నిర్మాత‌లు.